అన్వేషించండి

SSC CHSL Result: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2022 'టైర్‌-2' ఫలితాలు విడుదల- 3,242 అభ్యర్థులు ఎంపిక

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2022 టైర్‌-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్జు లై 8న విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2022 టైర్‌-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. టైర్-2 ఫలితాల్లో మొత్తం 3,242 అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌ 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్‌-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2022 టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 19న విడుదల చేసింది. అప్పుడు మొత్తం 40,224 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి జూన్ 26న టైర్‌-2 పరీక్ష నిర్వహించారు. టైర్-2 పరీక్ష ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 4న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జులై 4 నుంచి జులై 6 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా టైర్-2 ఫలితాలను విడుదల చేసింది.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ -2022 టైర్-2 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తర్వాతి దశంలో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ (టైర్-3) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల వివరాలు..
కేంద్రప్రభుత్వ విభాగాల్లో 4,500 ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2022 టైర్-1 పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 9 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించింది. పరీక్ష ఆన్సర్ కీని మార్చి 31న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అమార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. మే 19న టైర్-1 ఫలితాలను వెల్లడించింది. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ 26న టైర్-2 పరీక్ష నిర్వహించింది. తాజాగా టైర్-2 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేసింది.

సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget