News
News
వీడియోలు ఆటలు
X

SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పరీక్షల షెడ్యూలును మార్చి 29న ప్రకటించింది. పరీక్షల తేదీలు ఇలా..

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పరీక్షల షెడ్యూలును మార్చి 29న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2022 పరీక్షను  మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ తెలిపింది. అలాగే సబ్‌ఇన్‌స్పెక్టర్(ఢిల్లీ పోలీస్), సీఆర్‌పీఎఫ్-2022(టైర్-2) పరీక్షను మే 2న, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్-2022(టైర్-2) పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఇక సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్-2023 జూన్ 27 నుంచి 30 వరకు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్-2023(టైర్-1)ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.

మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఫలితాలు వెల్లడి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎంటీఎస్ (నాన్-టెక్నికల్), హవాల్దార్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 6న అభ్యర్థుల మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎంటీఎస్ (నాన్-టెక్నికల్) ఉద్యోగాలకు, రెండో జాబితా(లిస్ట్-1)లో హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇక మూడో జాబితాలో ఫలితాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.

మొత్తం 7518 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకుగాను 7494 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 3910 మంది మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు, హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) పోస్టులకు 3584 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 126 మంది అభ్యర్థుల నియామకాలకు వేర్వేరు కారణాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.

MTS (Non-Technical) - 2021 Final Result

Also Read:

కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 30 Mar 2023 11:41 AM (IST) Tags: SSC Exams 2023 dates Staff Selection Commission Exams Multi-Tasking Staff Exam 2022 Sub-Inspector in Delhi Police Central Armed Police Forces Examination CHSL 2022 Exam Date CGLE 2023 Exam Date Selection Post Examination

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!

EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!

Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!

Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!

NERIST: అరుణాచల్‌ప్రదేశ్‌ ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీలో 32 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

NERIST: అరుణాచల్‌ప్రదేశ్‌ ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీలో 32 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

SCTIMST: తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

SCTIMST:  తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!