అన్వేషించండి

SSC CHSL: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, 3712 పోస్టుల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

SSC: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న విడుదల చేసింది.

SSC CHSL 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL)-2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3712 లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు మే 7 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. టైర్‌-1, టైర్‌-2 రాతపరీక్షలతోపాటు అవసరమైన పోస్టులకు కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

వివరాలు..

* కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2024 

ఖాళీల సంఖ్య: 3712

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో)

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఏ)

➥ లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ)

➥ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్

అర్హత: 01.08.2024 నాటికి ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరిగా నిర్ణయించారు.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు మినహాయింపు వర్తిస్తుంది. ఇక ఢిఫెన్స్ పర్సనల్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వితంతు/ఒంటరి మహిళా అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వరిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఢిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఈ పోస్టులకు టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

జీతాభత్యాలు..

➥ ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200 ఇస్తారు.

➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100 (పే లెవల్-4), రూ.29,200-92,300 (పే లెవల్-4) ఇస్తారు. 

➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఎ)కు పోస్టులకు రూ.29,200-92,300 ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు:

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.05.2024 (23:00).

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: 08.05.2024 (23:00).

➥ అప్లికేషన్‌ సవరణ తేదీలు: 10.05.2024 - 11.05.2024 (23:00).

➥ టైర్‌-1 రాత పరీక్ష తేదీ: జూన్-జులై, 2024.

➥ టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget