SSC: స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి, త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులో
స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ టైర్-1 (ప్రిలిమినరీ) పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డులను రీజియన్లవారీగా ఆయా వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచనున్నారు.
స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ టైర్-1 (ప్రిలిమినరీ) పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డులను రీజియన్లవారీగా ఆయా వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 12, 13 తేదీల్లో స్టెనోగ్రాఫర్ టైర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను రెండు, మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నో యువర్ స్టేటస్, అభ్యర్థి రోల్ నెంబరు తదితర వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తామ పరీక్షకు అర్హత సాధించింది లేనిది తెలుసుకోవచ్చు.
రీజియన్లవారీగా అడ్మిట్ కార్డుల కోసం వెబ్‌సైట్లు..
సదరన్ రీజియన్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Know the Status of your application
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్-సి పరిధిలో 93 పోస్టులు ఉండగా.. గ్రేడ్-డి పరిధిలో 1114 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
పరీక్ష విధానం...
✦ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
✦ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
✦ పరీక్ష సమయం 2 గంటలు. ప్రత్యేక అవసరాలుగల అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు.
✦ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.
సదరన్ రీజియన్‌లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్.
స్కిల్ టెస్ట్:
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
సీడ్యాక్‌లో 277 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 277 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..