News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2022 టైర్‌-2 ఆన్సర్ 'కీ' విడుదల, ప్రశ్నపత్రం కూడా అందుబాటులో!

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2022 (టైర్‌-2) ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) జులై 4న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2022 (టైర్‌-2) ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) జులై 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్టర్డ్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి సమాధానాల కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌ను చూసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించి, జులై 4 నుంచి జులై 6 వరకు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2022 టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 19న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 40,224 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి  జూన్‌ 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్‌-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..

సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల వివరాలు..
కేంద్రప్రభుత్వ విభాగాల్లో 4,500 ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2022 టైర్-1 పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 9 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించింది. పరీక్ష ఆన్సర్ కీని మార్చి 31న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అమార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. మే 19న టైర్-1 ఫలితాలను వెల్లడించింది. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ 26న టైర్-2 పరీక్ష నిర్వహించింది. తాజాగా టైర్-2 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేసింది.

సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

టైర్-2 పరీక్ష విధానం..

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Jul 2023 10:53 AM (IST) Tags: SSC CHSL Answer Key Tier-1 SSC CHSL Answer Key SSC CHSL Tier 2 Answer Key SSC CHSL Result 2022 SSC CHSL Answer Key 2022 CHSL Tier-I Answer Key 2022 CHSL Objection Window 2022

ఇవి కూడా చూడండి

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

UPSC Exam Calender: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

UPSC Exam Calender: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !