News
News
వీడియోలు ఆటలు
X

SSC Constable Posts: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, పోస్టుల సంఖ్య 50,187కి పెంపు!

మరోసారి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్టు మార్చి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ సారి 3,257 పోస్టులను పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 50,187కి చేరింది. 

FOLLOW US: 
Share:

కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాల భర్తీ విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ పోస్టుల సంఖ్యను 50,187కు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే‌ రెండుసార్లు సవరణ‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్టు మార్చి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ సారి 3,257 పోస్టులను పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 50,187కి చేరింది. 

మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది. పదోతరగతి విద్యార్హతగా పేర్కొన్న ఈ ఉద్యోగాలకు జనవరిలో రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

పెరిగిన పోస్టులు ఇలా..
తాజాగా విడుదల చేసిన సవరణ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 50,187 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052; సీఐఎస్‌ఎఫ్‌లో 6,060; సీఆర్‌పీఎఫ్‌లో 11,169; ఎస్‌ఎస్‌బీలో 2274; ఐటీబీపీలో 5642, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించాక ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.

* పోస్టుల వివరాలు...

విభాగాల వారీగా ఖాళీలు..

1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 21,052 

2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 6060 

3) సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169

4) సశస్త్ర సీమాబల్ (SSB): 2274

5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1890 + 3,257 = 5642 

6) అసోం రైఫిల్స్ (AR): 3601

7) సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (SSF):  214

8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175

Also Read:

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Mar 2023 05:36 AM (IST) Tags: SSC Constable Recruitment Staff Selection Commission Constable (GD) Recruitment Constables in CAPFs Constables in SSF Constables in BSF SSC Constable GD Recruitment

సంబంధిత కథనాలు

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్