అన్వేషించండి

SSC CGL: సీజీఎల్ 2023 'టైర్-1' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 

ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 4న సాయంత్రం 6 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు.

ఆన్సర్, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..

ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 

సీజీఎల్‌ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 3 నుంచి మే 3 తేదీల్లో దరఖాస్తు చేసుకున్నారు. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది.

ALSO READ:

యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫైన‌ల్ కీ విడుద‌ల‌, త్వరలోనే ఫలితాల వెల్లడి!
తెలంగాణలో  గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమిన‌రీ పరీక్ష ఫైన‌ల్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 1న విడుద‌ల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. తుది కీ వెల్లడి కావడంతో.. త్వ‌ర‌లోనే ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నున్నారు. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రూప్-1 ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget