By: ABP Desam | Updated at : 01 Aug 2023 10:10 PM (IST)
Edited By: omeprakash
గ్రూప్-1 ఫైనల్ ఆన్సర్ కీ
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. తుది కీ వెల్లడి కావడంతో.. త్వరలోనే ఫలితాలు విడుదల చేేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.
ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రూప్-1 ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రంలో 503 'గ్రూప్-1' సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 28న ప్రాథమిక కీని విడుదల చేసి టీఎస్‌పీఎస్సీ జులై 1 నుంచి జులై 5 వరకు ఆన్సర్ కీ అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకుని పరిశీలించిన విషయ నిపుణులు రూపొందించిన గ్రూప్-1 తుది కీని ఆగస్టు 1న విడుదల చేసింది.
ఆగస్టు నెలాఖరు నుంచి ఫలితాల వెల్లడి..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీపరీక్షలు నిర్వహిస్తున్న టీఎస్‌పీఎస్సీ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు ప్రారంభించింది. న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల ఫైనల్‌కీ వెల్లడించి, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్, తుది కీని జులై 31 లేదా లేదా ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ:
'గ్రూప్-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు, ఎంపికైతే భారీగా జీతభత్యాలు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ప్యాకల్టీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 23 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే వీరికి రెగ్యులర్ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు ఇవ్వనుండటం విశేషం. కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్ నియామకాలు చేపడితే మాత్రమే వీరు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉండగా.. వాటిలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలను మినహాయించి మిగిలిన 23 కాలేజీల్లో పోస్టులు భర్తీ కానున్నాయి.
నోటిఫికేష్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా
AIIMS: ఎయిమ్స్ రాయ్బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
SBI PO Recruitment: ఎస్బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>