UPSC Civils Mains: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూపీఎస్సీ వెల్లడించింది.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం, నాలెడ్జ్, విలువలను పరీక్షించే రీతిలో ప్రశ్నలు అడుగుతారు.
ALSO READ:
'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల, త్వరలోనే ఫలితాల వెల్లడి!
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. తుది కీ వెల్లడి కావడంతో.. త్వరలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రూప్-1 ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..