SSC CGL Recruitment: సీజీఎల్ 2022 కరెక్షన్ విండో ఓపెన్! తప్పులుంటే సరిదిద్దుకోండి!!
కేవలం రెండుసార్లు మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పుంలుంటే సరిదిద్దుకోవచ్చు. మొదటిసారి కరెక్షన్ కోసం అభ్యర్థులు రూ.200, రెండోసారి కరెక్షన్ కోసం అయితే రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2022 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) అవకాశం కల్పించింది. సీజీఎల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబరు 19, 20 తేదీల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. వాస్తవానికి అక్టోబరు 12, 13 తేదీల్లో దరఖాస్తుల సవరణ ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే దరఖాస్తు గడువును అక్టోబరు 8 నుంచి 13కు పొడిగించడంతో అప్లికేషన్ కరెక్షన్ తేదీలను కూడా ఎస్‌ఎస్‌సీ అక్టోబరు 19, 20 తేదీలకు పెంచింది. అక్టోబరు 20 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించుకోవచ్చు. అయితే కేవలం రెండుసార్లు మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పుంలుంటే సరిదిద్దుకోవచ్చు. మొదటిసారి కరెక్షన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.200, రెండోసారి కూడా కరెక్షన్ చేసుకోవాలనుకునేవారు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల సవరణ ఇలా...
* అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అక్కడ లాగిన్ సెక్షన్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయాలి.
* SSC CGL 2022 అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ విండో స్క్రీన్ మీద కనిపిస్తుంది.
* SSC CGL 2022 అప్లికేషన్ ఫామ్‌లో కరెక్షన్ ఉంటే చేసుకోవాలి.
* దరఖాస్తులో పేర్కొన్న అన్ని వివరాలను స్పష్టంగా సరిచూసుకోవాలి.
* వివరాల కరెక్షన్ తర్వాత 'Final Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.
* కరెక్షన్ తర్వాత మారిన దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
సీజీఎల్ 2022 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరులో విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనుంది. డిసెంబరులో టైర్-1 పరీక్ష నిర్వహించనుంది. తర్వాత టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్ష నిర్వహించనుంది. తర్వాతి దశలో టైర్-3 కూడా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలో 20వేల పోస్టులను భర్తీక చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
SSC CGL 2022 Notification, Posts Details
:: ఇవీ చదవండి ::
AOC: ఆర్మీలో చేరే యువతకు శుభవార్త, అగ్నివీర్ ఎంపికలు 29 నుంచే!
సైన్యంలో చేరే యువత కోసం అగ్నివీర్ ఎంపికలు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్(ఏఓసీ) కేంద్రంలోని ఏబీసీ ట్రాక్‌లో నిర్వహిస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది.
నియామక ర్యాలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Recruitment: ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 29లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి నవంబరు 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..