(Source: ECI/ABP News/ABP Majha)
AOC: ఆర్మీలో చేరే యువతకు శుభవార్త, అగ్నివీర్ ఎంపికలు 29 నుంచే!
హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది.
సైన్యంలో చేరే యువత కోసం అగ్నివీర్ ఎంపికలు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్(ఏఓసీ) కేంద్రంలోని ఏబీసీ ట్రాక్‌లో నిర్వహిస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది.
క్రీడాకారులకు 26న..
ఓపెన్ కేటగిరీలో ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు అక్టోబరు 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రంలోని థాపర్ స్టేడియంలో హాజరు కావాలని సైనికాధికారులు తెలిపారు. బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, ఈత, అథ్లెటిక్స్, క్రికెట్, కబడ్డీ క్రీడల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినవారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని వివరించారు. ఈ పత్రాలు రెండేళ్ల లోపువై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్‌లోని ఏఓసీ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
వివరాలు..
విభాగాలు: జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ).
అర్హత: జనరల్ డ్యూటీ(జీడీ),ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తుచేసుకొనే అభ్యర్ధులు పదవతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. టెక్(ఏఈ)కి సైన్స్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సోల్జర్ జనరల్ డ్యూటీ(జీడీ),ట్రేడ్స్‌మెన్‌కు 17½ - 21సంవత్సరాలు, సోల్జర్ టెక్(ఏఈ)కి 17½ - 23 సంవత్సరాలు గల అభ్యర్ధులు అర్హులు.
ముఖ్యమైన తేదీలు..
క్రీడాకారులు(ఓపెన్ కేటగిరీ)లో అగ్నివీర్ ఎంపికల తేదీ: 26.10.2022.
అగ్నివీర్ ఎంపికల తేదీలు: 29.10.2022 నంచి 15.01.2023 వరకు
క్రీడాకారులు(ఓపెన్ కేటగిరీ) అభ్యర్ధులు రిపోర్టు చేయాల్సిన చిరునామా: Thapar Stadium, AOC Centre, Secunderabad.
చిరునామా: Headquarters AOC Centre, East Marredpally, Tirmulgherry, Secunderabad (TS) 500015.
Also Read
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏఈఈ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 20 వరకు టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 14తో ముగిసింది. అయితే గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..