By: ABP Desam | Updated at : 13 Jun 2023 02:01 PM (IST)
Edited By: omeprakash
ఎస్ఈటీఎస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
చెన్నైలోని సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ(ఎస్ఈటీఎస్) ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 09
✦ ప్రాజెక్ట్ అసోసియేట్(సాఫ్ట్‌వేర్): 06
అర్హత: బీఈ/బీటెక్(సీఎస్‌ఈ/ ఐటీ/ఈసీఈ/ సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) లేదా ఎంసీఏలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. ఎంఈ/ఎంటెక్(కంప్యూటర్ సైన్స్/సైబర్ సెక్యూరిటీ/నెట్‌వర్క్‌సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
అనుభవం: రిసెర్చ్&డెవలప్‌మెంట్‌లో 0-4 సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.30,000- రూ.50,000 చెల్లిస్తారు.
✦ ప్రాజెక్ట్ అసోసియేట్: 02
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్(సీఎస్‌ఈ/ ఐటీ/ఐసీటీ /ఈసీఈ/ఈఈఈ/ఈ&ఐ/ సీఎస్) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్‌సీ(సీఎస్ఈ/ఐటీ) ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: 2-4 సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.40,000- రూ.50,000 చెల్లిస్తారు.
✦ ప్రాజెక్ట్ సైంటిస్ట్: 01
అర్హత: ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ ద్వారా రిసెర్చ్(కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ సైబర్ సెక్యూరిటీ)లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్&ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీ) కలిగి ఉండాలి.
అనుభవం: సైబర్ సెక్యూరిటీ, క్రిప్టాలజీ, PKI, బ్లాక్‌చెయిన్ మరియు నెట్‌వర్క్ సెక్యూరిటీ ప్రాంతాలలో R&D ప్రాజెక్ట్‌లలో 5 సంవత్సరాల పని అనుభవం లేదా పీహెచ్‌డీలో 4 సంవత్సరాల
అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.80,000- రూ.90,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.06.2023.
Also Read:
టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్ పోస్టులు, అర్హతలివే!
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రొబేషనరీ ఇంజినీర్ & సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌సీ(టెక్), ఎంఈ/ఎంటెక్, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా
AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
SBI PO Recruitment: ఎస్బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>