అన్వేషించండి

సశస్త్ర సీమాబల్ ఫలితాలు విడుదల, 'టైర్-2'కు 11,054 మంది అభ్యర్థులు ఎంపిక

సశస్త్ర సీమాబల్‌లో ASI-స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్,  హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్‌ కమాండెంట్‌(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబరు 26, 27 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.

SSB Exam Result: సశస్త్ర సీమాబల్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ASI)-స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్,  హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్‌ కమాండెంట్‌(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబరు 26, 27 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పోస్టులవారీగా ఫలితాల జాబితాలను ఎస్‌ఎస్‌బీ విడుదల చేసింది. ఫలితాలకు సంబంధించి మొత్తం 11,054 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. ఇందులో ఏఎస్‌ఐ స్టెనోగ్రాఫ్ పోస్టులకు 800 మంది, హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) పోస్టులకు 145 మంది అర్హత సాధించారు.

ఇక  కానిస్టేబుల్ పోస్టులకు 10,109 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. వీరిలో కానిస్టేబుల్ (కార్పెంటర్)-20, కానిస్టేబుల్ (బ్లాక్‌స్మిత్)-08, కానిస్టేబుల్ (డ్రైవర్)-1781, కానిస్టేబుల్ (టైలర్)-19, కానిస్టేబుల్ (గార్డెనర్)-56, కానిస్టేబుల్(కాబ్లర్)-30, కానిస్టేబుల్(వెటర్నరీ)-480, కానిస్టేబుల్(పెయింటర్)-19, కానిస్టేబుల్(వాషర్‌మ్యాన్)-935, కానిస్టేబుల్(బార్బర్)-154, కానిస్టేబుల్(సఫాయ్‌వాలా)-1935, కానిస్టేబుల్(కుక్-మెన్)-2312, కానిస్టేబుల్(కుక్-ఉమెన్)-48, కానిస్టేబుల్(వాటర్ క్యారియర్)-2312.   

SSB ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమాబల్‌ 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా లేదా దేశం వెలుపలా నియమించే అవకాశం ఉంది. 

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 1656

➥ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌: 111 పోస్టులు 

➥ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పారామెడికల్‌): 30 పోస్టులు 

➥ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌): 40 పోస్టులు 

➥ హెడ్‌కానిస్టేబుల్‌: 914 పోస్టులు 

➥ కానిస్టేబుల్‌ పోస్టులు: 543 పోస్టులు  

➥ అసిస్టెంట్‌ కమాండెంట్‌(వెటర్నరీ): 18 పోస్టులు  

ఎంపిక విధానం..
ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌ఈ), రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సబ్‌–ఇన్‌స్పెక్టర్‌(కమ్యూనికేషన్‌) పోస్టుకు మాత్రమే పీఈటీ నిర్వహిస్తారు. 1.6 కిలో మీటర్ల పరుగును పురుష అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో ముగించాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల రేసును 4 నిమిషాల్లో ముగించాలి. ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పీఈటీ లేదు. వీరు పీఎస్‌టీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లకు హాజరుకావాలి.

రాత పరీక్ష విధానం..
పీఈటీ, పీఎస్‌టీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష రెండు పార్ట్‌లుగా 150 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. పార్ట్‌–1లో జన km,klరల్‌ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్‌ /జనరల్‌ హిందీ 50 మార్కులకు ఉంటాయి. పార్ట్‌–2లో టెక్నికల్‌ సబ్జెక్టుకు 100 మార్కులుంటాయి. రాతపరీక్షకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాలి.

రాత పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్టులను నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget