RRC NWR: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు, వివరాలిలా!
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 2026.
డివిజన్ల వారీగా ఖాళీలు..
1. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, అజ్మేర్: 413
2. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, బికనీర్: 423
3. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జైపూర్ డివిజన్: 494
4. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జోధ్‌పూర్ డివిజన్: 404
5. బీటీసీ క్యారేజ్, అజ్‌మేర్: 126
6. బీటీసీ లోకో, అజ్‌మేర్: 65
7. క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 31
8. క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 70
ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్ మిషెన్ టూల్ మేయింటనెన్స్, మెషినిస్ట్, తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 10.02.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023.
Also Read:
సికింద్రాబాద్- దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు!
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు-అర్హతలివే!
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్, యూజీసీనెట్, క్లాట్ (పీజీ), సీఎం/సీఎంఏ స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..