TSNPDCL Recruitment: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభం ఉండాలి.
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
* ఛార్టర్డ్ అకౌంటెంట్ ఫిర్మ్ పోస్టులు
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.
పోస్టుల సంఖ్య: 157
జిల్లాలవారీగా ఖాళీలు: హనుమకొండ్-11, వరంగల్-10, జనగాం-08, మహబూబాబాద్-08, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి-07, కరీంనగర్-13, పెద్దపల్లి-10, జగిత్యాల-09, ఖమ్మం-15, బద్రాద్రి కొత్తగూడెం-10, నిజామాబాద్-16, కామారెడ్డి-11, ఆదిలాబాద్-07, నిర్మల్-07, మంచిర్యాల-08, కుమురంభీం-ఆసిఫాబాద్-06, కార్పొరేట్ ఆఫీస్-01 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభం ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: రూ.35,000.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
The Chief General Manager (Audit)
TSNPDCL, Corporate Office, 3rd Floor,
Vidyuth Bhavan, Nakkalagutta,
Hanamkonda-506 001, Telangana.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 23.01.2023.
Also Read:
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెండు స్టాచ్యుటరీ పోస్టులు, గ్రూప్-ఎ విభాగంలో 6 పోస్టులు, గ్రూప్-బి విభాగంలో 21 పోస్టులు, గ్రూప్-సి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ & రీజెనరేటివ్ మెడిసిన్‌లో ఖాళీలు!
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ & రీజెనరేటివ్ మెడిసిన్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023, జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
'కేంద్రీయ' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు చివరితేదీని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును 2023, జనవరి 2 వరకు పొడిగిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చివరితేది మాత్రమే మారిందని.. అభ్యర్థుల అర్హతలు, వయోపరిమితి, అనుభవం తదితర వివరాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని కేవీఎస్ తెలిపింది.
పోస్టుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..