ISCSMR Jobs: ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ & రీజెనరేటివ్ మెడిసిన్‌లో ఖాళీలు!
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023, జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ & రీజెనరేటివ్ మెడిసిన్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023, జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 03
1) టెక్నికల్ ఆఫీసర్ (ఎంజీఈఎఫ్ ఫెసిలిటీ): 01
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (బయోసైన్సెస్). పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: 2-4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.01.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. డిప్యూటేషన్ అభ్యర్థులు 56 సంవత్సరాలలోపు ఉండాలి.
2) టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ-వెబ్ డెవలపర్): 01
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (బయోసైన్సెస్). పీజీ ఉండాలి.
అనుభవం: 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.01.2023 నాటికి 38 సంవత్సరాలలోపు ఉండాలి.
3) ఇంజినీర్ (సివిల్): 01
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (బయోసైన్సెస్). పీజీ ఉండాలి.
అనుభవం: 8-10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.01.2023 నాటికి 43 సంవత్సరాలలోపు ఉండాలి. డిప్యూటేషన్ అభ్యర్థులు 56 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.354, ఇంజినీర్ పోస్టులకు రూ.885 చెల్లించాలి.
ఎంపిక విధానం: టైర్-1(రాతపరీక్ష), టైర్-2 (ఇంటర్వ్యూ)/ స్కిల్ టెస్ట్.
ముఖ్యమైన తేదీలు..
🔰 నోటిఫికేషన్ వెల్లడి: 31.12.2022
🔰 వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెల్లడి: 16.12.2022.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.12.2022.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2023
Also Read:
KVS Jobs Application: 'కేంద్రీయ' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు చివరితేదీని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును 2023, జనవరి 2 వరకు పొడిగిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చివరితేది మాత్రమే మారిందని.. అభ్యర్థుల అర్హతలు, వయోపరిమితి, అనుభవం తదితర వివరాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని కేవీఎస్ తెలిపింది.
పోస్టుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్ పోస్టుల 'అప్లికేషన్ స్టేటస్' వచ్చేసింది! చెక్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..