NHPC Recruitment: నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు-అర్హతలివే!
ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్, యూజీసీనెట్, క్లాట్ (పీజీ), సీఎం/సీఎంఏ స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 401
➥ ట్రైనీ ఇంజినీర్ (సివిల్): 136 పోస్టులు
➥ ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 41 పోస్టులు
➥ ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్): 108 పోస్టులు
➥ ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): 99 పోస్టులు
➥ ట్రైనీ ఆఫీసర్ (హెచ్ఆర్): 14 పోస్టులు
➥ ట్రైనీ ఆఫీసర్ (లా): 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్-2022, యూజీసీ-నెట్-డిసెంబర్ 2021 & జూన్ 2022, క్లాట్ 2022 (పీజీ) స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.01.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.50,000-రూ.1,60,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.295. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.01.2023.
Also Read:
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వరంగల్ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..