RRB Technician Grade 1, 3 Jobs : ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు నోటిఫికేషన్.. 6,180 పోస్టులు, అర్హతలు, పూర్తి వివరాలివే
RRB Technician Grade 1, 3 Jobs : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 కోసం 6,180 పోస్టులకు పిలుపునిచ్చింది. శాలరీలు ఎంత? అర్హతలు ఏంటి వంటి పూర్తి వివరాలు చూసేద్దాం.

RRB Technician Grade 1 and Grade 3 Jobs Notification : రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ నోటిఫికేషన్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల పట్ల ఆసక్తి ఉన్నవారు.. జాబ్స్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు రుసుము, విద్య, శాలరీ, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
పోస్టులు
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్ కోసం) 180 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోసం 6,000 చొప్పున మొత్తం 6,180 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు - 6,180
కావాల్సిన అర్హతలు
ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకునేవారు బీటెక్ లేదా డిప్లోమో చేసి ఉండాలి. లేదా బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ కాంబినేషన్ చేసి ఉండాలి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలనుకుంటే పది అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.
జీతం
గ్రేడ్ 1 పోస్ట్ జీతం నెలకి 29,200. గ్రేడ్ 3 వారికి 19,900 జీతం వస్తుంది.
వయసు
గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకునేవారు 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. గ్రేడ్ 3కి అప్లై చేసేవారు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల పెంపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు పెంపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 పోస్ట్ల ఎంపిక కోసం ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దానిలో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే జూన్ 28, 2025 నుంచి అప్లై చేయవచ్చు. అలాగే 28 జులై వరకు సమయం ఉంటుంది.
ఫీజులు
ఎస్సీ, ఎస్టీలు 250 కడితే సరిపోతుంది. మిగిలిన వారు 500 అప్లికేషన్ రుసుము చెల్లించాలి.
గ్రేడ్ 1 ఎగ్జామ్ సిలబస్
ఆన్లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో General Awareness 10 మార్కులు, General Intelligence and Reasoning 15 మార్కులు, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్పై 20 మార్కులు, లెక్కలు 20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 35 మార్కులు ఇలా 100 మార్కులకు టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం కోసం అప్లై చేసేవారు సంబంధిత సిలబస్పై గ్రిప్ పెంచుకోవాలి.
గ్రేడ్ 3 ఎగ్జామ్ సిలబస్
లెక్కలు 25 మార్కులు, General Intelligence and Reasoning 25 మార్కులు, General Science 40 మార్కులు, General Awareness 10 మార్కులు ఉంటాయి.
గ్రేడ్ 1, గ్రేడ్ 3 కి అప్లై చేయాలనుకునేవారు ఆయా సిలబస్ ఫాలో అవ్వాలి. కటాఫ్ కూాడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది.






















