RRB Group-D PET: 'గ్రూప్-డి' అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు ప్రారంభం! హాజరుకానున్న 24,596 మంది అభ్యర్థులకు టెస్టులు!
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ గ్రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 21 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరి 12 నుంచి ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ) ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ గ్రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 21 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకే అభ్యర్థులు గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 4.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య అభ్యర్థుల షెడ్యూలు ప్రకారం ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. పీఈటీకి ఎంపికైన అభ్యర్థుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, కమ్యూనిటీ, పీఈటీ తేదీ, సమయం, నిర్వహణ స్థలం వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సంగతి తెలిసిందే.
రాతపరీక్ష ఫలితాలు డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ జోన్‌లో 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు. పీఈటీ నుంచి దివ్యాంగులకు మినహాయింపు నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించలేదు. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ చూడాలని రైల్వే శాఖ సూచించింది.
RRB గ్రూప్-డి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కటాఫ్ మార్కులు..
ఫిజిక్ పరీక్షల షెడ్యూలు ఇలా..
రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరిలో శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)లు నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).
1,03,769 గ్రూప్-డి పోస్టులకు పరీక్ష..
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు.
గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో నవంబరు మూడోవారంలో తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.డిసెంబరు నెలాఖరులో ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా అధికారులు విడుదల చేయనున్నారు.
Also Read:
సీడీఎస్ ఎగ్జామినేషన్ (I) - 2023 నోటిఫికేషన్ విడుదల!
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2023 నోటిఫికేషన్ వెల్లడి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2023, ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..