అన్వేషించండి

RRB Group D Result: ఆర్ఆర్‌బీ 'గ్రూప్-డి' ఫలితాలు, సికింద్రాబాద్ జోన్‌లో 24,596 మంది ఎంపిక!

పరీక్షకు సంబంధించి 5 దశల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైనవారికి తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.

ఇండియన్ రైల్వేలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) ఫలితాలు డిసెంబరు 22న వెలువడ్డాయి. ఈ మేరకు రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించి 5 దశల ఫలితాలను మొత్తం కలిపి ఒకేసారి విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సికింద్రాబాద్, భువనేశ్వర్, కోల్‌కతా, భోపాల్, గువాహటి జోన్ల ఫలితాలను ప్రకటించింది. మిగిలిన జోన్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఆయా రైల్వే జోన్ల పరిధిలోని వెబ్‌సైట్‌లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ జోన్‌లో మొత్తం  24,596 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరికి తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).

సికింద్రాబాద్ జోన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరిలో శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)లు నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని రైల్వే శాఖ సూచించింది. 

1,03,769 గ్రూప్-డి పోస్టులకు పరీక్ష..
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. 

గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో నవంబరు మూడోవారంలో తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.డిసెంబరు నెలాఖరులో ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా అధికారులు విడుదల చేయనున్నారు. 

రీజియన్లవారీగా వెబ్‌సైట్లు..

Ahmedabad  Bhopal Chennai Mumbai
Ajmer Bhubaneswar Gorakhpur Patna
Allahabad Bilaspur Guwahati Ranchi
Bangalore Chandigarh Kolkata Secunderabad

Also Read:

సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (I) - 2023 నోటిఫికేషన్‌ విడుదల! 
కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2023 నోటిఫికేషన్ వెల్లడి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2023, ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget