News
News
వీడియోలు ఆటలు
X

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రెండు జాబితాల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను పొందుపరిచారు.

FOLLOW US: 
Share:

➥ రెండు జాబితాల్లో ఫలితాలు అందుబాటులో

➥ ఉద్యోగాలకు 7,869 మంది అభ్యర్థులు ఎంపిక

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈమేరకు రైల్వే రిక్రూ ట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), సికింద్రాబాద్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రెండు జాబితాల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను పొందుపరిచారు. మొదటి జాబితాలో రెగ్యులర్ అభ్యర్థులు, రెండో జాబితాలో అప్రెంటిస్ అభ్యర్థులు ఉన్నారు.

లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు.. అలాగే ఈ ఏడాది జనవరిలో శారీరక సామర్థ్య పరీక్షలు, ఫిబ్రవరిలో ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణులైన 7,869 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో.. అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలెట్, అసిస్టెంట్ వర్క్స, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులు ఉన్నాయి. 

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరి 12 నుంచి ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ గ్రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 21 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. 

ఇక రాతపరీక్ష ఫలితాలు డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ జోన్‌లో 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు. పీఈటీ నుంచి దివ్యాంగులకు మినహాయింపు నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించలేదు. తాజాగా అందరినీ పరిగణనలోకి తీసుకొని తుది ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).

Final Results (Part-1)

Final Results  (Part-2)
(CCAAs - Course Completed Act Apprentices)

1,03,769 పోస్టులు..
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. 

గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో నవంబరు మూడోవారంలో తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.డిసెంబరు నెలాఖరులో ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా అధికారులు విడుదల చేయనున్నారు.  

Also Read:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 22 Mar 2023 04:43 PM (IST) Tags: rrb group d RRB Railway Recruitment Board RRB Group D Result 2022 RRB Group D Result RRB 2022 Group D Result

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!