Reliance Recruitment: రిలయన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2024, ఈ అర్హతలుండాలి
Reliance Jobs: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో చురుకుగా సహకరించడానికి టాప్ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటుంది.
![Reliance Recruitment: రిలయన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2024, ఈ అర్హతలుండాలి Reliance released notification for the recruitment of Graduate Engineer Trainee 2024 Reliance Recruitment: రిలయన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2024, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/d2221e034f023e60d82a894dd28423ad1705080755483522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reliance Recruitment: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో చురుకుగా సహకరించడానికి టాప్ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటుంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) ప్రోగ్రామ్ అనేది యువ ఇంజినీరింగ్ ప్రతిభను పెంపొందించడానికి ఒక ఎంట్రీ-లెవెల్ ప్రోగ్రామ్. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ- 2024లో భాగంగా వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపడుతోంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమకాలకు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపడుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
➥ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (గెట్) ప్రోగ్రామ్
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హత: ఏదైనా AICTE ఆమోదించిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ బీటెక్/బీఈ డిగ్రీలు ఉన్న ఫ్రెషర్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగంలో 2024లో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్‌లో మొత్తం 60% / 6.0 CGPA మరియు అంతకంటే ఎక్కువ స్కోరు (7వ సెమిస్టర్/ గ్రాడ్యుయేషన్ వరకు) కలిగి ఉండాలి. కనీసం 60% మార్కులతో పదో తరగతి, ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మంచిగా చదవటం మరియు రాయటం వచ్చి ఉండాలి.
అనుభవం: ఫ్రెషర్స్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం..
➦ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగంలో చేరినప్పుడు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.7.50 లక్షలు ఇస్తారు. 12 నెలలు పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.8.00 లక్షలు ఇస్తారు. ఇక వార్షిక బోనస్ కింద సంవత్సరానికి రూ.88 వేలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయిన తర్వాత రూ. 3 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఇస్తారు.
➦ నాన్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగంలో చేరినప్పుడు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.9.00 లక్షలు ఇస్తారు. 12 నెలలు పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.9.50 లక్షలు ఇస్తారు. ఇక వార్షిక బోనస్ కింద సంవత్సరానికి సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయిన తర్వాత రూ.5 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 11.01.2024 నుంచి 19.01.2024 వరకు.
➥ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ తేదీలు: 05.02.2024 నుంచి 08.02.2024 వరకు.
➥ ఇంటర్వ్యూ తేదీలు: 23.02.2024 నుంచి 01.03.2024 వరకు.
➥ తుది ఎంపికలు: మార్చి, 2024 చివరి నాటికి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)