అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

RRB Exam schedule: 41,500 రైల్వే ఉద్యోగాల రాతపరీక్షల షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్స్ తేదీలు ఇవే

RRB Exams: రైల్వేశాఖలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి.

RRB Recruitment Exams 2024 Schedule: దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో 41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నవంబరు 25 నుంచి 29 మధ్య అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు, డిసెంబరు 2 నుంచి 5 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్ఐ పోస్టులకు, డిసెంబరు 6 నుంచి 13 వరకు జూనియర్ ఇంజినీర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక డిసెంబరు 16 నుంచి 26 మధ్య టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. 

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, పరీక్షల తేదీ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.

దేశంలోని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను ఈ పరీక్షల ద్వారా భర్తీచేయనున్నారు. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ పోస్టులు; 14,298 టెక్నీషియన్‌ పోస్టులు; 7,951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు ఇప్పటికే ముగియగా.. టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష తేదీల వివరాలు...

➥ అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1): 25.11.2024 నుంచి 29.11.2024 వరకు

➥ ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ: 02.12.2024 నుంచి 05.12.2024 వరకు

➥ జూనియర్ ఇంజినీర్: 06.12.2024 నుంచి 13.12.2024 వరకు

➥ టెక్నీషియన్: 16.12.2024 నుంచి 26.12.2024 వరకు

RRB Exam schedule: 41,500 రైల్వే ఉద్యోగాల రాతపరీక్షల షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్స్ తేదీలు ఇవే

ALSO READ: 
రైల్వేశాఖలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు (చివరితేది 13.10.2024)
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీచేయనున్నారు.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

రైల్వే టెక్నీషియన్ పోస్టులు భారీగా పెంపు (చివరితేది 16.10.2024)
రైల్వే ఉద్యోగార్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త తెలిపింది. టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 14,298కి చేరింది. 
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

రైల్వే ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం (చివరితేది: 20.10.2024)
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) అండర్ గ్రాడ్యుయేట్(NTPC-Under Graduate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 3445 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP : అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP : అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
సరస్వతీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ ... దర్శనానికి పోటెత్తిన భక్తులు!
సరస్వతీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ ... దర్శనానికి పోటెత్తిన భక్తులు!
Egg Freezing : పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?
పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?
Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
Andhra News: పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
Embed widget