అన్వేషించండి

RRB Recruitment: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, టెక్నీషియన్ పోస్టులు భారీగా పెంపు - 14వేలు దాటిన ఖాళీల సంఖ్య

RRB: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్ల పరిధిలో టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 5154 పోస్టులను జతపరచింది.

RRB Technician 2024 Vacancy Increased: రైల్వే ఉద్యోగార్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త తెలిపింది. టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 14,298కి చేరింది. గతంలో కేవలం 18 కేటగిరీల్లో పోస్టులను పేర్కొనగా.. తాజాగా మొత్తం 40 కేటగిరీల నుంచి పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా పెరిగిన పోస్టుల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు చేరాయి. అత్యధికంగా ముంబయి జోన్ పరిధిలో 1883, అత్యల్పంగా సిలిగిరి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే ప్రాధామ్యాల నమోదుకు రైల్వేశాఖ అవకాశం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన తాజాసమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 8న విడుదలకాగా.. మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు/నవంబరు నెలల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతంగా ఇస్తారు.

పెరిగిన టెక్నీషియన్ పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
RRB Recruitment: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, టెక్నీషియన్ పోస్టులు భారీగా పెంపు - 14వేలు దాటిన ఖాళీల సంఖ్య

వివరాలు..

🔰 టెక్నీషియన్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 14,298

➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 5,154 పోస్టులు

➥ టెక్నీషియన్ గ్రేడ్-III సిగ్నల్: 9,144 పోస్టులు

ఎంపిక విధానం:  సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం:  మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. 

➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్‌ అవేర్‌నెస్‌ -10 ప్రశ్నలు- 10 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ -15 ప్రశ్నలు- 15 మార్కులు, బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ -20 ప్రశ్నలు-20 మార్కులు, మ్యాథమెటిక్స్‌ -20 ప్రశ్నలు-20 మార్కులు, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ -35 ప్రశ్నలు-35 మార్కులు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 

➥ టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్‌ -25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ -25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ సైన్స్‌ -40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ -10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. 

RRB Technician Posts: నిరుద్యోగులకు అలర్ట్, రైల్వేల్లో 9,144 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.

Notification

Website

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget