(Source: ECI/ABP News/ABP Majha)
కేంద్ర విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా 6,028 పోస్టులు - కేంద్రం వెల్లడి!
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 6,028 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మార్చి 15న లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 6,028 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం ఖాళీల్లో జనరల్-2154, ఎస్సీ-878, ఎస్టీ-520, ఓబీసీ-1543, ఈడబ్ల్యూఎస్-611, పీడబ్ల్యూడీ కేటగిరీ-322 పోస్టులు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో మార్చి 15న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐఐటీల్లో 4,562; ఐఐఎంల్లో 496 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19లో 10,83,747 ఉన్న విద్యార్థుల సంఖ్య 2021-22 నాటికి 10,22,386కి తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.
కేంద్రీయ పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు
- కేంద్రీయ విద్యాలయాల్లో 12,099 టీచింగ్, 1,312 నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271 టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,756 నాన్ టీచింగ్ పోస్టులు వేకెంట్‍గా ఉన్నాయి.
- ఉన్నత విద్యాసంస్థలైన, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో (Central Universities)ల్లో 6,180 టీచింగ్, 15,780 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
- ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)ల్లో 4,425 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,052 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి సిద్దం ఉన్నాయి.
- నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీల్లో 2,089 టీచింగ్, 3,773 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా కొనసాగుతున్నాయి.
- ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్& రీసెర్చ్ విద్యాసంస్థల్లో 353 టీచింగ్, 625 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‍మెంట్ (IIMs)ల్లో 1,050 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Also Read:
AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?
ఏపీలో 2 లక్షల 79 వేల కోట్లతో ప్రభుత్వం 'ఏపీ బడ్జెట్-2023' ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేసింది. మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి, సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్-2023 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థినులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్, జూన్ నుంచి ప్రత్యేక బస్సులు!
విద్యార్థినుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మీ 'అగ్నివీర్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకానికి సంబంధించిన దరఖాస్తు గడువును ఆర్మీ పొడిగించింది. అగ్నివీరుల దరఖాస్తు గుడువు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ -2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టులు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..