రూ.800 కోట్ల జాయినింగ్ బోనస్ ఇచ్చి మరీ ఉద్యోగంలోకి తీసుకున్నారట - మెటాలో మన బన్సల్
OpenAI: భారతీయ టెకీకి 800 కోట్ల జాయినింగ్ బోనస్ ఇచ్చి మరీ ఓపెన్ ఏఐ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఐఐటీ కాన్పూర్ లో చేరిన ట్రాపిట్ బన్సాల్ కు ఈ ఆఫర్ వచ్చింది.

Open AI job offer for Indian techie : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిపుణులకు ఇప్పుడు ఊహించనంత డిమాండ్ ఉంది. ఎంతగా ఉంటే.. కంపెనీలో చేరితే జీతాలు కాదు.. అంతకు మించి ఓపెనింగ్ బోనస్ ఇస్తామంటున్నారు. అలా చాట్ జీపీటీ కంపెనీ ఓపెన్ ఏఐలో భారతీయ టెకీ ఉద్యోగం సంపాదించుకున్నారు.
ఐఐటీ కాన్పూర్ నుండి గణితం మరియు స్టాటిస్టిక్స్‌లో డ్యూయల్ డిగ్రీలు చేసిన ట్రాపిట్ బన్సాల్ .. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మెటా-లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP)లో స్పెషలైజ్ చేశాడు. 2012లో గురుగ్రామ్‌లోని యాక్సెంచర్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌లో అనలిస్టుగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆ తర్వాత, అతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో రెండు సంవత్సరాల పాటు బేసియన్ మోడలింగ్ , ఇన్ఫరెన్స్ పద్ధతులపై పరిశోధనా సహాయకుడిగా పనిచేశాడు.
2022లో, బన్సాల్ ఓపెన్‌ఏఐలో టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా చేరాడు, అక్కడ అతను సహ-వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కెవర్‌తో కలిసి రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) , రీజనింగ్‌పై పనిచేశాడు. అతను ఓపెన్‌ఏఐ మొదటి ఏఐ రీజనింగ్ మోడల్ సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించాడు, ఇది చాట్‌జీపీటీ అంతర్గత రీజనింగ్ సామర్థ్యాలకు ఆధారం. తాజాగా ఆయన ఓపెన్‌ఏఐ నుండి బయటకు వచ్చాడు,
మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL)లో చేరాడు. ఇది మార్క్ జుకర్‌బర్గ్ సోమవారం ప్రకటించిన కొత్త యూనిట్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీమ్‌ను మాజీ స్కేల్ ఏఐ CEO అలెక్సాండర్ వాంగ్ , మాజీ గిట్‌హబ్ CEO నాట్ ఫ్రైడ్‌మన్ నాయకత్వం వహిస్తున్నారు.
మెటా ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ డీప్‌మైండ్ నుండి ఎలైట్ ఏఐ పరిశోధకులను నియమించడానికి ఆకర్షణీయమైన పే ప్యాకేజీలను అందిస్తోంది. కొన్ని సందర్భాల్లో నాలుగు సంవత్సరాలకు 300 మిలియన్ డాలర్ల వరకు అంటే సుమారు 2500 కోట్ల రూపాయలు వరకూ ఇచ్చారు. మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఫ్రాంటియర్ ఏఐ రీజనింగ్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మెటాకు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఏఐ రీజనింగ్ మోడల్ లేదు. బన్సాల్‌తో పాటు, లూకాస్ బేయర్, అలెక్సాండర్ కోలెస్నికోవ్, జియాహువా జాయ్ వంటి మాజీ ఓపెన్‌ఏఐ పరిశోధకులు కూడా ఇటీవల మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ టీమ్‌లో చేరారు .
Meta did not care for diversity. Meta did not care for affirmative action. Meta wanted the best. Coincidentally, 8 out of 12 are Asians.
— Based Monk (#Unreserved) (@thatindicmonk) July 1, 2025
Trapit BANSAL is now going to earn ₹84 crore annually.
kyu re muftkhor @priyanka2bharti, Koi bhimta kyu nahi select hota aise sab mei ? pic.twitter.com/CNkkC5bS2i
ట్రాపిట్ బన్సాల్ యొక్క మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో చేరడం, ఏఐ పరిశోధనలో భారతీయ ప్రతిభ పెరుగుదలను, సిలికాన్ వ్యాలీలోని టాప్ టెక్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీని హైలైట్ చేస్తుందని చెబుతున్నారు.




















