Gujarat High Court: బీర్ తాగుతూ వాదించిన లాయర్ - సీనియర్ అడ్వకేట్‌పై గుజరాత్ హైకోర్టు కంటెంప్ట్ కేసు
Beer Advocate : ఓ కేసు విచారణ జరుగుతోంది. ఆ కేసులో ఓ సీనియర్ లాయర్ వాదిస్తున్నారు. వర్చువల్ హియరింగ్ కు హాజరయ్యారు. ఆ లాయర్ హాయిగా బీర్ సిప్ చేస్తూ.. వాదించారు.

Gujarat High Court initiates contempt case against Senior Advocate : ఆన్ లైన్ కోర్టు విచారణల్లో లాయర్లు, కక్షిదారులు విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. తాజాగా గుజరాత్ హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ బీర్ తాగుతూ తన కేసులో వాదనలు వినిపించిన వ్యవహారం వైరల్ గా మారింది.
జూన్ 26, 2025న జస్టిస్ సందీప్ భట్ నేతృత్వంలోని గుజరాత్ హైకోర్టు వర్చువల్ విచారణ సమయంలో సీనియర్ అడ్వొకేట్ భాస్కర్ తన్నా బీర్ మగ్‌తో తాగుతూ, ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఈ ఘటన వీడియో క్లిప్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది.
ఈ ఘటనను జస్టిస్ ఎ.ఎస్. సుపేహియా , జస్టిస్ ఆర్.టి. వచ్ఛానీల డివిజన్ బెంచ్ ముందు జూన్ 30, 2025న ప్రస్తావనకు వచ్చింది. కోర్టు ఈ ప్రవర్తనను "అసభ్యకరమైన , అవమానకరమైన" చర్యగా అభివర్ణించింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. భాస్కర్ తన్నాపై సుమోటోగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసును నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ చర్య ఎటువంటి ఫిర్యాదు లేకుండా కోర్టు స్వయంగా తీసుకున్న నిర్ణయం. తన్నాను వర్చువల్ విచారణలలో ఈ బెంచ్ ముందు కనిపించకుండా నిషేధించారు. ఈ ఆదేశాన్ని ఇతర బెంచ్‌లకు కూడా వర్తింపజేయాలని చీఫ్ జస్టిస్ అనుమతితో సర్కులేట్ చేయాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
రిజిస్ట్రీని వీడియోను రికార్డుగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వరకు నివేదిక సిద్ధం చేయమని ఆదేశించారు. తన్నాకు నోటీసు జారీ చేశారు. తన్నా ప్రవర్తన సీనియర్ అడ్వొకేట్ హోదాకు అనుగుణంగా లేదని, ఈ హోదాను ఉపసంహరించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ నిర్ణయం తదుపరి విచారణల తర్వాత తీసుకుంటారు.
Gujarat High Court on June 30 initiated suo motu contempt of court proceedings against Senior Advocate Bhaskar Tanna for allegedly drinking beer during a virtual hearing.
— Bar and Bench (@barandbench) July 2, 2025
“The indecent act of of the senior advocate has very wide ramifications as it has travelled beyond the… pic.twitter.com/bCx88XsrDQ
జస్టిస్ ఎ.ఎస్. సుపేహియా నేతృత్వంలోని బెంచ్, తన్నా "అసభ్యకరమైన చర్య విస్తృత పరిణామాలను కలిగి ఉంది" అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది "న్యాయవ్యవస్థ గౌరవం , ఘనతను దెబ్బతీస్తుంది" అని పేర్కొంది. ఈ ప్రవర్తనను విస్మరిస్తే, న్యాయవ్యవస్థ సంస్థాగత అధికారం కూలిపోతుందని హెచ్చరించింది. సీనియర్ అడ్వొకేట్‌లు యువ న్యాయవాదులకు ఆదర్శంగా ఉంటారని, తన్నా యొక్క ప్రవర్తన ఈ హోదాకు మచ్చ తెచ్చిందని కోర్టు గుర్తించింది. "ఇటువంటి చర్య యువ న్యాయవాదులపై ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వారు సీనియర్ అడ్వొకేట్‌లను రోల్ మోడల్స్‌గా చూస్తారు" అని కోర్టు అభిప్రాయపడింది.





















