ONGC: ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్‌లో 40 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
ఆయిల్&నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎఓఎన్‌జీసీ) ఆధర్వంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ పెట్రో అడిషన్స్ లిమిటెడ్(ఓపల్) వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయిల్&నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎఓఎన్‌జీసీ) ఆధర్వంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ పెట్రో అడిషన్స్ లిమిటెడ్(ఓపల్) వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 40
* అప్రెంటిస్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ ఫిట్టర్: 08
⏩ కెమికల్ ప్లాంట్: 16
⏩ విద్యుత్: 05
⏩ ఎలక్ట్రిక్: 04
⏩ మెకానిక్: 02
⏩ ల్యాబ్: 03
⏩ మెషిన్: 02
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18-21 సంవత్సరాలు ఉండాలి.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 11.08.2023.
Notification& Online Application
ALSO READ:
IBPS PO: 3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..