News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IBPS PO: 3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 3049 పోస్టులు

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000

➥ కెనరా బ్యాంక్: 500

➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224

➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

➥ పంజాబ్ సింధ్ బ్యాంక్: 125

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌యోపరిమితి: 01.08.2023 నాటికి 20 - 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1993 - 01.08.2003 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
రీజినింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం  100 100 60 నిమిషాలు

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం: 01.08.2023

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.08.2023

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబరు 2023

➥ మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబరు/న‌వంబ‌రు 2023

➥ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2023

➥ మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2023

➥ ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024

➥ ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024

➥ నియామకం: ఏప్రిల్ 2024

Notification

Online Application

Website

ALSO READ:

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 124 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్‌సీఎఫ్‌ఎల్‌) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 09వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్‌లైన్‌టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 01 Aug 2023 11:40 AM (IST) Tags: Bank Jobs IBPS PO Posts IBPS PO IBPS PO Notification 2023 IBPS PO/ MT Recruitment 2023 IBPS PO 2023 Recruitment Notification IBPS MT 2023 Recruitment Notification

ఇవి కూడా చూడండి

NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు, అర్హతలివే

NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు, అర్హతలివే

TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా

TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా

BEML: బీఈఎంఎల్‌ బెంగళూరులో 119 గ్రూప్ సి పోస్టులు, వివరాలు ఇలా

BEML: బీఈఎంఎల్‌ బెంగళూరులో 119 గ్రూప్ సి పోస్టులు, వివరాలు ఇలా

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?