అన్వేషించండి

IBPS SO Recruitment: 1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది.

దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1402

1) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 500 

బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-400, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.

అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ఫిషరీస్ ఇంజినీరింగ్)

2) హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-12, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-04.

అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).

3) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120

బ్యాంకులవారీగా ఖాళీలు: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-20, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.

అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐటీ).

4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-10.

అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.

5) మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 700

బ్యాంకులవారీగా ఖాళీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్-700.

అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.

6) రాజ్‌భాషా అధికారి (స్కేల్-1): 41

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-16, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-10.

అర్హత: పీజీ డిగ్రీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ స్థాయిలో హిందీ/ సంస్కృతం తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1993 - 01.08.2003 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన కుటుంబీకులకు 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ:  ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2023.

➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2022/ 31.12.2023.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2024.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.

➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.

➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/ మార్చి 2024.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2024.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Notification

Online Application

Website

ALSO READ:

3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desamమురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget