NTPC Jobs: ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్-2022 పరీక్షకు హాజరై ఉండాలి.
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్-2022 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హత ఉన్నవారు నవంబరు 11లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు:
* ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 864 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2022కి హాజరై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: దరఖాస్తు ముగింపునాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్లలో పోస్టింగ్ ఇస్తారు.
జీతం: రూ.40,000 నుంచి రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.2022.
Notification
Website
::Also Read::
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు షురూ! ఇలా అప్లయ్ చేసుకోండి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 77 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అక్టోబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...