News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

APPSC:మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు షురూ! ఇలా అప్లయ్ చేసుకోండి!

మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న  ప్రారంభమైంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

APPSC Recruitment: ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న  ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు: 151

1) మెడికల్ ఆఫీసర్ (యునాని):  
26 (క్యారీడ్ ఫార్వర్డ్-21, కొత్త పోస్టులు-05)

2) మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి):  53(క్యారీడ్ ఫార్వర్డ్- 01, కొత్త పోస్టులు-52)

3) మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద):  72 (క్యారీడ్ ఫార్వర్డ్-13, కొత్త పోస్టులు-59)

అర్హతలు:
 అభ్యర్థులు యునాని/హోమియో/ఆయుర్వేద డిగ్రీతోపాటు మెడికల్ ప్రాక్టీసనీర్‌గా శాశ్వత సభ్యత్వం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:
 రాతపరీక్ష, మెడికల్ ఫిట్‌‌నెస్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు:
 అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

రాతపరీక్ష విధానం:
 మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 350 మార్కులు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 

పరీక్షలో అర్హత మార్కులు:
 జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 

జీతం:
 నెలకు రూ.57,100 – రూ.1,47,760.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.10.2022

ఫీజు చెల్లించడానికి చివరితేది: 20.11.2022


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2022


MO - Notification (Unani)                        

MO - Notification (Homoeopathy)        

MO - Notification (Ayurveda)                 

 

Online Application

 

ఇవీ చదవండి:

APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC AEE Recruitment: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇలా!
ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతే కాకుండా ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

Published at : 06 Oct 2022 08:18 PM (IST) Tags: AP Jobs AP Govt Jobs APPSC Jobs APPSC MO Recruitment APPSC Recruitment 2022 APPSC Medical Officer Recruitment APPSC MO Notification

ఇవి కూడా చూడండి

ECIL Apprenticeship: ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

ECIL Apprenticeship: ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
×