RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు.
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
* నాన్-టీచింగ్ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 534
1.సైంటిస్ట్-బి(న్యూక్లియర్ మెడిసిన్): 01 పోస్టు
2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు
3. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు
4.సైంటిస్ట్-ఎ(రేడియేషన్ అంకాలజీ): 01 పోస్టు
5. సైంటిస్ట్-ఎ(రిసెర్చ్): 01 పోస్టు
6. వెటర్నరీ ఆఫీసర్: 01 పోస్టు
7.సిస్టర్ గ్రేడ్-2: 431 పోస్టులు
8. అసిస్టెంట్ డైటీషియన్: 01 పోస్టు
9. లైబ్రేరియన్ గ్రేడ్-3: 04 పోస్టులు
10.స్టోర్ కీపర్ కమ్ పర్చేజ్ అసిస్టెంట్: 21 పోస్టులు
11.జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01 పోస్టు
12. ఫార్మసిస్ట్ గ్రేడ్-3: 17 పోస్టులు
13.స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు
14.స్టెనోగ్రాఫర్: 01 పోస్టు
15. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 10 పోస్టులు
16. లోయర్ డివిజన్ అసిస్టెంట్: 39 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి:18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టెక్నికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ మూడోవారం/ చివరి వారం, 2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్, 2022.
Notification
Website
:: Also Read ::
ఏపీలో లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 21 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏబీవీ - ఐఐఐటీఎంలో ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
గ్వాలియర్‌లోని అటల్‌బిహారీ వాజ్‌పేయ్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఐఐఐటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(CSE), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(EEE), మేనేజ్‌మెంట్ స్టడీస్(MS) మరియు అప్లైడ్ సైన్సెస్(AS) వంటి విభాగాల్లో ఖాళీగా వున్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు దరఖాస్తులను సంబంధిత చిరునామాకు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1 లోపు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...