ABV-IIITM Recruitment: ఏబీవీ - ఐఐఐటీఎంలో ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
అటల్‌బిహారీ వాజ్‌పేయ్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఐఐఐటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
![ABV-IIITM Recruitment: ఏబీవీ - ఐఐఐటీఎంలో ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే! ABV-IIITM Gwalior invites applications for the recruitment of 56 faculty positions,apply here ABV-IIITM Recruitment: ఏబీవీ - ఐఐఐటీఎంలో ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/2af056333f1b38773d0e4ba49f20d42a1665135822712522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గ్వాలియర్‌లోని అటల్‌బిహారీ వాజ్‌పేయ్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఐఐఐటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(CSE), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(EEE), మేనేజ్‌మెంట్ స్టడీస్(MS) మరియు అప్లైడ్ సైన్సెస్(AS) వంటి విభాగాల్లో ఖాళీగా వున్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు దరఖాస్తులను సంబంధిత చిరునామాకు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.
వివరాలు...
*మొత్తం ఖాళీలు: 56
విభాగాలు: సీఎస్ఈ, ఐటీ, ఈఈఈ, ఎంఎస్, ఏఎస్(మ్యాథ్స్).
పోస్టుల వారీగా ఖాళీలు..
1. ప్రొఫెసర్: 24 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం:10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు.
జీతం: నెలకు రూ.159100-రూ.220200 చెల్లిస్తారు.
2. అసోసియేట్ ప్రొఫెసర్: 09 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: 06 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు.
జీతం: నెలకు రూ.139600-రూ.211300 చెల్లిస్తారు.
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 23 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.
జీతం: నెలకు రూ.57700-రూ.167400 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ - ఎన్‌సీఎల్,ఈడభ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.1000. ఎస్టీ,ఎస్సీ అభ్యర్ధులకు రూ. 500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar (I/C), ABV - Indian Institute of Information Technology and Management Gwalior Morena Link Road, Gwalior, Madhya Pradesh, India - 474015.
దరఖాస్తు చివరి తేది: 27.10.2022
Notification
Website
Also Read:
ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు , పరీక్ష తేది ఇదే!
తెలంగాణలో 'గ్రూప్–1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌టికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు.
హాల్‌టికెట్లు, పరీక్షతేది వివరాల కోసం క్లిక్ చేయండి.
కోల్ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియాలో భాగంగా ఉన్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/బీడీఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు, వీరికి అవకాశం!
కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)