By: ABP Desam | Updated at : 22 Jan 2023 09:39 AM (IST)
Edited By: omeprakash
13 ప్రాంతీయ బాషల్లో పరీక్షలు
వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష మరో 13 భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష కేవలం హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భాష కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోవద్దని ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ ఎస్‌ఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న మిగతా భాషలనూ పరీక్షలో క్రమంగా చేర్చుతాం. దీనివల్ల చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నామని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
కేసీఆర్ లేఖ ఎఫెక్ట్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. సీఎం కేసీఆర్ రాసిన లేఖ మేరకు కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తిని కొనసాగించాలని కోరారు. రైల్వేలు, డిఫెన్స్, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు.
భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. కాగా, కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ రెండేళ్ల క్రితం రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రం దిగొచ్చిందంటూ కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు.
మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజియన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Adani Group - RSS: ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు - స్టోరీలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్