News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, పెరిగిన పోస్టుల సంఖ్య!

ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి మే 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే జూన్ 15తో ముగియాల్సి గడువును జూన్ 19 వరకు పొడిగించారు.

FOLLOW US: 
Share:

ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి మే 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే జూన్ 15తో ముగియాల్సి గడువును జూన్ 19 వరకు పొడిగించారు. అభ్యర్థులు జూన్ 19 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇండియన్ నేవీలో మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొదట 100 పోస్టులకే నోటిఫికేషన్ జారీచేసినప్పటికీ మరో 200 పోస్టులను అదనంగా చేర్చారు.  అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

వివరాలు..

* అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)

మొత్తం ఖాళీలు: 300 పోస్టులు(మెన్-240, ఉమెన్-60)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి: 01.11.2002 - 31.04.2005 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15.06.2023. (19.06.2023 వరకు పొడిగించారు)

➥ శిక్షణ ప్రారంభం: 2023, నవంబరులో.

Notification 

Online Application

Website

                                 
                                       

Also Read:

తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 19 Jun 2023 12:42 PM (IST) Tags: Indian Navy Recruitment Indian Navy Jobs Indian Navy Agniveer Notification Indian Navy Agniveer MR Recruitment

ఇవి కూడా చూడండి

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×