KGBV Recruitment: తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు...
➥ కేజీబీల్లో ఖాళీలు
పోస్టుల సంఖ్య: 1218
1) స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌వో): 38 పోస్టులు
2) పీజీ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్టీ): 849 పోస్టులు
సబ్జెక్టులవారీగా ఖాళీలు: ఇంగ్లిష్-110, మ్యాథమెటిక్స్-60, నర్సింగ్-110, తెలుగు-104, ఉర్దూ-02, బోటనీ-55, కెమిస్ట్రీ-69, సివిక్స్-55, కామర్స్-70, ఎకనామిక్స్-54, ఫిజిక్స్-56, జువాలజీ-54.
3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ): 254
సబ్జెక్టులవారీగా ఖాళీలు: బయోసైన్స్-25, ఇంగ్లిష్-52, హిందీ-37, మ్యాథమెటిక్స్-45, ఫిజికల్ సైన్స్-42, సోషల్ స్టడీస్-26, తెలుగు-27.
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ): 77
➥ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీలు..
పోస్టుల సంఖ్య: 23
1) స్పెషల్ ఆఫీసర్: 04
2) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ): 19
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు-05, ఇంగ్లిష్-05, సైన్స్-06, సోషల్ స్టడీస్-03.
అర్హతలు:
➦ పీజీసీఆర్టీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈడీ లేదా బీఏబీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఉండాలి. లేదా ఆర్‌సీఐ నుంచి సంబంధిత మెథడాలజీ సబ్జెక్టుతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి.
➦ పీజీసీఆర్టీ నర్సింగ్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఎంఎస్సీ (నర్సింగ్)/బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➦ స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈడీ లేదా బీఏబీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఉండాలి. లేదా ఆర్‌సీఐ నుంచి సంబంధిత మెథడాలజీ సబ్జెక్టుతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి. 02.06.2014కి ముందు టీఎస్‌టెట్/ఏపీటెట్/సీటెట్ (మ్యాథమెటిక్స్/సైన్స్/సోషల్ స్టడీస్) అర్హత ఉండాలి.
➦ పీఈటీ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికేట్/యూజీ డిప్లొమా/డిప్లొమా ఉండాలి. (లేదా) డిగ్రీ అర్హతతోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉన్న బీపీఈడీ కోర్సు ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం:
దరఖాస్తు ఫీజు: రూ.600.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 16.06.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.07.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు వారం ముందు నుంచి.
➥ రాతపరీక్ష తేది: జులై నెలలో.
ALSO READ:
గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూలును ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2.63 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..