(Source: ECI/ABP News/ABP Majha)
Indian Coast Guard: ఇండియన్ కోస్ట్‌గార్డులో 70 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డులోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 బ్యాచ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
Indian Coast Guard Recruitment: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డులోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 బ్యాచ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 70 జనరల్ డ్యూటీ, టెక్నికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అర్హులైన పురుష, మహిళ అభ్యర్థులు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
➥ అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్)
ఖాళీల సంఖ్య: 70.
1) జనరల్ డ్యూటీ (జీడీ): 50 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో 55 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 21-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.1999 - 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి. కోస్ట్‌గార్డు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తి్స్తుంది.
2) టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 20 పోస్టులు
అర్హతలు..
➥ మెకానికల్ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (నేవల్ ఆర్కిటెక్చర్/ మెకానికల్/ మెరైన్/ ఆటోమోటివ్/ మెకాట్రానిక్స్/ ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/ మెటలర్జి/ డిజైన్/ ఏరోనాటికల్/ ఏరోస్పేస్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో 55 శాతం మార్కులు ఉండాలి.
➥ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలకు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ పవర్ ఇంజినీరింగ్/ పవర్ ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో 55 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 21-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.1999 - 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి. కోస్ట్‌గార్డు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తి్స్తుంది.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1 (రాతపరీక్ష), స్టేజ్-2 (ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు), స్టేజ్-3 (ఫైనల్ సెలక్షన్ బోర్డు), స్టేజ్-4 (మెడికల్ ఎగ్జామ్), స్టేజ్-5 (ఇండక్షన్) దశలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం: అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో నెలకు రూ.56,100 బేసిక్ పేతో జీతం ఇస్తారు.
ముఖ్యమైనతేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2024.
➥ స్టేజ్-1 రాతపరీక్ష: ఏప్రిల్ నెలలో.
➥ స్టేజ్-2 (ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు) పరీక్షలు: మే నెలలో.
➥ స్టేజ్-3 (ఫైనల్ సెలక్షన్ బోర్డు) పరీక్షలు: జూన్/ఆగస్టు నెలల్లో.
➥ స్టేజ్-4 (మెడికల్ ఎగ్జామ్): జూన్/నవంబరు నెలల్లో.
➥ స్టేజ్-5 (ఇండక్షన్): డిసెంబరు చివరినాటికి.
ALSO READ:
ఇస్రోలో 224 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..