ISRO: ఇస్రోలో 224 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి
ISRO Recruitment: బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISRO Recruitment: బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 224.
1. సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ: 05 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ మెకాట్రానిక్- 02
➥ మెటీరియల్ సైన్స్- 01
➥ మ్యాథమెటిక్స్- 01
➥ ఫిజిక్స్- 01
2. టెక్నీషియన్-బి: 126 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ /మెకానిక్ కన్స్యూమర్ఎలక్ట్రానిక్ పరికరాలు/ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్- 63
➥ ఎలక్ట్రికల్ / ఎలక్ట్రీషియన్- 13
➥ ఫోటోగ్రఫీ / డిజిటల్ ఫోటోగ్రఫీ- 05
➥ ఫిట్టర్- 17
➥ ప్లంబర్- 03
➥ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (R&A/C)- 11
➥ టర్నర్- 02
➥ కార్పెంటర్- 03
➥ మోటార్ వెహికల్ మెకానిక్- 02
➥ మెషినిస్ట్- 05
➥ వెల్డర్- 02
3. డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి: 16 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) - 11
➥ డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)- 05
4. టెక్నికల్ అసిస్టెంట్: 55 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఎలక్ట్రానిక్స్- 28
➥ కంప్యూటర్ సైన్స్- 06
➥ ఎలక్ట్రికల్ - 05
➥ సివిల్- 04
➥ మెకానికల్ - 12
5. సైంటిఫిక్ అసిస్టెంట్: 06 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ కెమిస్ట్రీ- 02
➥ ఫిజిక్స్- 02
➥ యానిమేషన్ &మల్టీమీడియా- 01
➥ మ్యాథమెటిక్స్- 01
6. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు
7. కుక్: 04 పోస్టులు
8. ఫైర్‌మ్యాన్-ఎ: 03 పోస్టులు
9. లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’: 04 పోస్టులు
10.హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టును అనుసరించి 01.03.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: సైంటిస్ట్ / ఇంజినీర్ – SC / టెక్నికల్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750, టెక్నీషియన్-B/డ్రాఫ్ట్స్‌మ్యాన్-B/కుక్/ ఫైర్‌మ్యాన్-A/ లైట్ వెహికల్ డ్రైవర్-A/ హెవీ వెహికల్ డ్రైవర్-A పోస్టులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
వేతనం: నెలకు సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులకు రూ.56,100; టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900; టెక్నీషియన్-బి/డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులకు రూ.21,700; కుక్/ఫైర్‌మ్యాన్-ఎ/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’&హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ పోస్టులకు రూ.19,900.
ముఖ్యమైనతేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.03.2024.