Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
ICG: ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు సమర్పించాలి.
Indian Coast Guard Notification: భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డు... వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 బ్యాచ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 140 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 24లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐదు దశల పరీక్షలు, ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 140
పోస్టుల కేటాయింపు: యూఆర్-55,ఈడబ్ల్యూఎస్-04, ఎస్సీ-17, ఎస్టీ-17, ఓబీసీ-47.
విభాగాలవారీగా ఖాళీలు:
1) జనరల్ డ్యూటీ (జీడీ): 110 పోస్టులు
2) టెక్నికల్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 30 పోస్టులు
అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి(ఫిజిక్స్/ మ్యాథ్స్), డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (నేవల్ ఆర్కిటెక్చర్/ మెకానికల్/ మెరైన్/ ఆటోమోటివ్/ మెకాట్రానిక్స్/ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్/ మెటలర్జీ/ డిజైన్/ ఏరోనాటికల్/ ఏరోస్పేస్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 21-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
* పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత మార్కుల షీట్లు
* ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత మార్కుల షీట్, సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ (సెమిస్టర్ల వారీగా)
* డిగ్రీ లేదా పీజీ విద్యార్హత మార్కుల షీట్, సర్టిఫికేట్ (సెమిస్టర్/సంవత్సరాల వారీగా)
* డిగ్రీ ఒరిజినల్/ ప్రొవిజినల్ సర్టిఫికేట్
* ఒకవేళ సంబంధిత విద్యార్హత చివరిసంవత్సరం లేదా సెమిస్టర్‌కు సంబంధించిన సర్టిఫికేట్లు
* కులధ్రువీకరణ పత్రం (కేటగిరీ సర్టిఫికేట్ - అవసరమైనవారికి)
* ప్రభుత్వ ఉద్యోగులైతే.. పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి 'NOC' తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2024.
* స్టేజ్-1 పరీక్ష తేదీ: 25.02.2025.
ALSO READ:
కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం
కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల (PO Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల నుంచి డిసెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 22న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ. 48,480 - రూ. 1,17,000 వరకు జీతం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..