IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఏప్రిల్ 1న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గతేడాది డిసెంబరులో ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఐబీపీఎస్ SO తుది ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి. - https://www.ibps.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలకు సంబంధించిన 'CRP SPL-XI Final Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులకు సంబంధించిన తుది ఫలితాలకు సంబంధించిన పేపీ ఓపెన్ అవుతుంది.
➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేయాలి.
➥ అభ్యర్థులకు సంబంధించిన తుది ఫలితాలు చూసుకోవచ్చు.
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..