అన్వేషించండి

IBPS SO Prelims: ఐబీపీఎస్‌ ఎస్‌వో ప్రిలిమ్స్‌ కాల్‌ లెటర్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్‌ పరీక్ష కాల్‌ లెటర్లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డిసెంబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.

IBPS SO Prelims Halltickets: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL-XIII) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్ష కాల్‌ లెటర్లను (Admit Cards) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) డిసెంబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌/రోల్ నెంబరు, పుట్టిన తేదీ/పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి కాల్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబరు 30 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్‌ 30, 31వ తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జనవరిలో విడుదల కానున్నాయి. 

దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆగస్టు 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బ్యాంకుల్లో 1402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 1 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 

స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1402

1) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 500 

బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-400, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.

అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ఫిషరీస్ ఇంజినీరింగ్)

2) హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-12, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-04.

అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).

3) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120

బ్యాంకులవారీగా ఖాళీలు: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-20, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.

అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐటీ).

4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-10.

అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.

5) మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 700

బ్యాంకులవారీగా ఖాళీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్-700.

అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.

6) రాజ్‌భాషా అధికారి (స్కేల్-1): 41

బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-16, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-10.

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget