IBPS SO: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును ఆగస్టు 28 వరకు పొడిగిస్తూ ఐబీపీఎ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 21తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగిసిన సంతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువును ఆగస్టు 28 వరకు పొడిగిస్తూ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆగస్టు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 1402
1) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 500
బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-400, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.
అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ఫిషరీస్ ఇంజినీరింగ్)
2) హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-12, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-04.
అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).
3) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120
బ్యాంకులవారీగా ఖాళీలు: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-20, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.
అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐటీ).
4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-10.
అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
5) మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 700
బ్యాంకులవారీగా ఖాళీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్-700.
అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.
6) రాజ్‌భాషా అధికారి (స్కేల్-1): 41
బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-16, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-10.
అర్హత: పీజీ డిగ్రీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ స్థాయిలో హిందీ/ సంస్కృతం తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1993 - 01.08.2003 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన కుటుంబీకులకు 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2023.
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2022/ 31.12.2023.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2024.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.
➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.
➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/ మార్చి 2024.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2024.
➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.
ALSO READ:
IBPS PO: ఐబీపీఎస్ పీవో దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల దరఖాస్తు గడువు ఆగస్టు 21తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువును మరోవారంపాటు పొడిగిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆగస్టు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..