By: ABP Desam | Updated at : 18 Oct 2022 07:59 PM (IST)
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీవో ఫలితాలు
గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-1 (పీవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరు 18న ప్రకటించింది. అదేవిధంగా స్కేల్-II, స్కేల్-III ఆఫీసర్ ఆన్‌లైన్ పరీక్ష (సింగిల్ స్టేజ్) ఫలితాలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబరు 28 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల స్కోరు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Officer Scale-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Officer Scale-2 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Officer Scale-3 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్-4483 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ I -2676 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ II - 867 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేయగా.. ఆఫీసర్ స్కేల్-1 (పీవో) ఫలితాలను సెప్టెంబరు 14న విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 1న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీసర్ స్కేల్-II, స్కేల్-III సింగిల్ స్టేజ్ పరీక్షలను సెప్టెంబరు 24న నిర్వహించింది. వీటి ఫలితాలను తాజాగా ఐబీపీఎస్ వెల్లడించింది.
ఫలితాలు ఇలా చేసుకోండి..
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/
2) అక్కడ హోంపేజీలో కనిపించే ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను
నమోదుచేయాలి.
4) కంప్యూటర్ తెర మీద పీవో పరీక్షకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి.
5) అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
:: ఇవీ చదవండి ::
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
UPSC: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
RITES: రైట్స్ లిమిటెడ్లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
/body>