IBPS PO Mains: ఐబీపీఎస్ పీవో స్కోరు కార్డులు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 3049 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నిర్వహించిన పీవో మెయిన్ స్కోరు కార్డును ఐబీపీఎస్ ఫిబ్రవరి 2న విడుదల చేసింది.
IBPS PO 13th Mains result: దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 3049 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఐబీపీఎస్ మెయిన్స్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) జనవరి 30న విడుదలచేసిన సంగతి తెలిసిందే. అయితే మెయిన్స్ పరీక్ష స్కోరుకార్డును ఐబీపీఎస్ ఫిబ్రవరి 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డును అందుబాటులో ఉంచింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలు నమోదు చేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోరుకార్డు ఫిభ్రవరి 20 వరకు అందుబాటులో ఉండనుంది. ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అభ్యర్థులు వీటికి హాజరయ్యే ముందు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంటుల్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ స్కోరుకార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి.-https://www.ibps.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో మెయిన్స్ ఫలితాల కోసం "CRPPO/MT Common Recruitment Process for Probationary Officer/Management Trainee." లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో/ ఎంటీ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటనను సెప్టెంబరు 30న నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పీవో పోస్టులకు సంబంధించి సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న 'ప్రిలిమ్స్' పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబరు 18న విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి నవంబర్ 5న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:
➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000
➥ కెనరా బ్యాంక్: 500
➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224
➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200
➥ పంజాబ్ సింధ్ బ్యాంక్: 125
ధ్రువపత్రాల పరిశీలనకు కావాల్సిన సర్టిఫికేట్లు..
➥ఇంటర్వ్యూ కాల్ లెటర్
➥ ఐబీపీఎస్ మెయిన్స్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింటెడ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో
➥ ఫొటో ఐడీకార్డు
➥ డిగ్రీ సర్టిఫికేట్లు
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు)
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు)
➥ డిజెబిలిటీ సర్టిఫికేట్ (దివ్యాంగులకు)
➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్వీస్ లేదా తత్సమాన సర్టిఫికేట్
➥ ప్రభుత్వ ఉద్యోగులైలే NOC తీసుకోవాలి
➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్