News
News
వీడియోలు ఆటలు
X

IB Answer Key: ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు.

FOLLOW US: 
Share:

కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీకి మార్చి 23, 24 తేదీల్లో టైర్-1 రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఆన్సర్ కీని తాజాగా విడుదల చేశారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మార్చి 31న రాత్రి 11.55 గం. వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకుంటారు. 

ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 1675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 దరఖాస్తులు స్వీకరించింది. టైర్-1, టైర్-2, టైర్-3 రాతపరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

టైర్-1 పరీక్ష విధానం..

మొత్తం 100 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటి & రీజనింగ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ స్టడీస్ -20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 4 తప్పుడు సమాధానానికి ఒకమార్కు అంటే ప్రతి తప్పు సమాధానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. 

టైర్-2 పరీక్ష విధానం.. 

టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో 40 మార్కులకు 'టైర్-2' పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష పూర్తిగా ఆఫ్‌‌లైన్ (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. ఇందులో అభ్యర్థులు 500 పదాలతో కూడిన ప్యాసేజీని స్థానిక భాష నుండి ఇంగ్లిష్‌లోకి అనువాదం (ట్రాన్స్‌లేట్) చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లిష్ నుంచి స్థానిక భాషలోకి అనువాద చేయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. అయితే టైర్-2లో కేవలం సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ మాత్రమే 10 మార్కులకు స్పోకెన్ ఎబిలిటి టెస్ట్ నిర్వహిస్తారు. టైర్-3లో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుకు సంబంధించి అభ్యర్థులు సామర్థ్యం అంచనావేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

టైర్-3 పరీక్ష విధానం..

టైర్-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-3లో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టు నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. 

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పరీక్షల షెడ్యూలును మార్చి 29న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2022 పరీక్షను  మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ తెలిపింది. అలాగే సబ్‌ఇన్‌స్పెక్టర్(ఢిల్లీ పోలీస్), సీఆర్‌పీఎఫ్-2022(టైర్-2) పరీక్షను మే 2న, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్-2022(టైర్-2) పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఇక సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్-2023 జూన్ 27 నుంచి 30 వరకు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్-2023(టైర్-1)ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 31 Mar 2023 12:21 PM (IST) Tags: Ministry of Home Affairs Intelligence Bureau answer key 2023 IB Security Assistant answer key IB SA Answer Key IB MTS Answer Key IB Answer Key 2023

సంబంధిత కథనాలు

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

NIRT: చెన్నై ఎన్‌ఐఆర్‌టీలో 24 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

NIRT: చెన్నై ఎన్‌ఐఆర్‌టీలో 24 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!