అన్వేషించండి

ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ తుది రాత‌ప‌రీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ & సీవో) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్షల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది.

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుంది. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ & సీవో) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్షల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 30న‌ ఈ రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించాల‌ని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను ఏప్రిల్ 24 తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి ఏప్రిల్ 28న అర్థరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.

ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ తుది రాత‌ప‌రీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ తుది రాత‌ప‌రీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

Also Read:

ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్, ఆన్‌లైన్‌లో ఏఈఈ(సివిల్) ప‌రీక్ష నిర్వహణ!
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 21న ఏఈఈ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధతిలో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని గ‌తంలో టీఎస్‌పీఎస్సీ ప్రక‌టించిన సంగతి తెలిసిందే. అయితే ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చర్, మెకానిక‌ల్ పోస్టుల‌తో పాటు సివిల్ పోస్టుల‌కు కూడా ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న అధికారికంగా ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. తుది స్కోరు ఖ‌రారులో నార్మలైజేష‌న్ ప‌ద్ధతిని పాటించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. 
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

యూపీఎస్సీ సీఎంఎస్-2023 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 1261 పోస్టుల భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget