News
News
వీడియోలు ఆటలు
X

CRPF Constable Recruitment: కానిస్టేబుల్‌ పోస్టులు పెరిగాయోచ్! 9,360కు చేరిన ఖాళీల సంఖ్య - వయోపరిమితి పెంపు! దరఖాస్తు గడువు కూడా పొడిగింపు!

సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకాగా.. మే 2తో ముగియనుంది.

FOLLOW US: 
Share:

కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) దేశవ్యాప్తంగా ఇటీవల 9,212  కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాళీలకు తాజాగా 148 పోస్టులను అదనంగా జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 9,360కు చేరింది. ఆ మేరకు ఎత్తు, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్టుకు సంబంధించి పలు మార్పులు చేసినట్లు సీఆర్‌పీఎఫ్ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.

సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు అర్హులు. పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 25తో ముగియాల్సిన గడువును మే 2 వరకు పొడిగించారు. దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును మే 2 వరకు పొడిగిస్తూ సీఆర్‌పీఎఫ్‌ నిర్ణయం తీసుకుంది.

వయోపరిమితి పెంపు..
కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి నిబంధనల్లో సీఆర్‌పీఎఫ్ మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులకు సంబంధించి గతంలో 21-27 సంవత్సరాల పరిమితి విధించగా ప్రస్తుతం 21-30 సంవత్సరాలకు సడలించింది. కానిస్టేబుల్‌(మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌) పోస్టులకు సంబంధించి గతంలో 18-23 సంవత్సరాల పరిమితి ఉండగా ప్రస్తుతం 18-26 సంవత్సరాలకు పెంచింది. ఖాళీల విషయంలోనూ మార్పులు జరిగాయి.

                                   

వివరాలు..

*  కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్): 9,360 

మెన్ కేటగిరీ పోస్టులు: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి.

ఉమెన్ కేటగిరీ పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.

అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 18-26 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కుల్కు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో హిందీ/ ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు-25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. 

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్.

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

జీత భత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.03.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2023. (02.05.2023 వరకు పొడిగించారు)

➥ సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 20.06.2023 - 25.06.2023 వరకు.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 01.07.2023 - 13.07.2023 వరకు.

సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..


Online Application 

 

13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్‌ ఎగ్జామ్..
సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే యువతకు శుభవార్త చెప్పింది కేంద్రం. ఇకనుంచి ప్రాంతీయ భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటివరకూ కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే నిర్వహించే ఈ పరీక్షలను ఇక నుంచి ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CAPF) లాంటి పరీక్షలను తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. 2024 జనవరి 1 తేదీ నుంచి ఈ విధానం కానుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 19 Apr 2023 04:56 PM (IST) Tags: CRPF Constable Recruitment 2023 CRPF Constable Recruitment Notification 2023 crpf jobs 2023 CRPF Constable Notification 2023

సంబంధిత కథనాలు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు -  అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!