TS Gurukul Notification 2023: గురుకుల పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు? అభ్యర్థులు ఆలోపు ఉంటేనే!
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్‌టీ)గా నిర్వహించే విషయమై బోర్డు యోచిస్తోంది. అయితే సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 35వేల లోపు ఉంటేనే సీబీటీ విధానంలో నిర్వహించాలని భావిస్తోంది. ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఓఎంఆర్ లేదా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని, ఈ విషయంలో గురుకుల బోర్డుదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం పరీక్ష విధానాల్లో మార్పులు చేయాలని ఇప్పటికే కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు అవసరమైతే షిఫ్టుల విధానంలో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కమిషన్ తరహాలో సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వెంటనే ఇచ్చేందుకు వీలవుతుందని గురుకుల నియామక బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. పరీక్షలు ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలా? లేదా సీబీఆర్‌టీ విధానంలో నిర్వహించాలా? అనే విషయమై బోర్డు త్వరలోనే సమావేశమై తుదినిర్ణయం తీసుకోనుంది. గురుకుల పోస్టుల భర్తీ సబ్జెక్టుల వారీగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వచ్చే దరఖాస్తుల సంఖ్య 35 వేల వరకు ఉంటే సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భావిస్తోంది. ఈ మేరకు త్వరలో పరీక్షలపై స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులు- అర్హతలివే!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.