అన్వేషించండి

IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం

India beats Pakistan by Runs | కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs PAK T20 World Cup 2026 | కొలంబో: హిస్టరీ రిపీట్ అయింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచులో సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో పాక్ జట్టును చిత్తు చేసింది. దాంతో టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం నమోదు కాగా, టోర్నీలో పాక్ జట్టుకు తొలి ఓటమిని భారత్ రుచి చూపించింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. భారత్ నుంచి ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ రాణించలేదు. 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు కాగా, సగానికి పైగా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. చివర్లో షాహిన్ ఆఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్) పోరాటంతో పాక్ పరువు దక్కే స్కోరు చేయగలిగింది. కానీ భారత్ చేతిలో ఓటమితో పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో తొలి పరాభవాన్ని ఎదుర్కొంది.  

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, పాక్ జట్లు 9 సార్లు తలపడగా టీమిండియా 8 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. పాక్ ఒక్క మ్యాచ్ నెగ్గింది. ఓవరాల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 17 మ్యాచులలో ఈ జట్లు తలపడగా భారత్ 14 నెగ్గగా, ఒక్క మ్యాచ్ పాక్ గెలిచింది. ప్రత్యర్థి పాక్ అయితే విజయం టీమిండియాదే అని మరోసారి ప్రూవ్ చేసింది డిఫెండింగ్ ఛాంపియన్. 


IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం

ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే, ఇషాన్ కిషన్ (77 పరుగులు, 40 బంతుల్లో) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం

పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న పాక్, ఏకంగా 18 ఓవర్ల పాటు స్పిన్నర్లతో అటాక్ చేసి భారత పరుగుల వేగాన్ని కట్టడి చేసింది. ఇషాన్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ నెమ్మదించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27), ఆఖర్లో రింకూ సింగ్ (11) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లతో రాణించగా, సల్మాన్ ఆగా, ఉస్మాన్ తారిక్, షాహీన్ అఫ్రిదీ తలో వికెట్ తీశారు.


IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం

తొలి ఓవర్లోనే పాక్ జట్టుకు షాక్..
ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు హార్దిక్ పాండ్యా షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 4వ బంతికే ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ఆడిన బంతిని రింకూ క్యాచ్ పట్టడంతో సెలబ్రేషన్ మొదలైంది. తరువాత ఓవర్లో బుమ్రా మరో ఓపెనర్ సాయిబ్ అయుబ్ (6) వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కెప్టెన్ సల్మాన్ ఆగా (4) విఫలమయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో షాట్ ఆడిన బంతిని హార్దిక్ క్యాచ్ అందుకున్నాడు. బాబర్ ఆజం (5) ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు.  

34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పాక్ జట్టును కీపర్ ఉస్మాన్ ఖాన్ (44) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఉస్మాన్ ఖాన్ స్టంపౌట్ అయ్యాడు. తరువాత వరుసగా వికెట్లవేట కొనసాగింది. చివర్లో షాహిన్ ఆఫ్రిది (23 నాటౌట్) కాసేపు పోరాడటంతో పాక్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. లేకపోతే స్కోరు వంద కూడా దాటేది కాదు. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Advertisement

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget